టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం: రూ.230 కోట్లతో మౌలిక వసతుల పనులకు శ్రీకారం
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh
శ్రీవారి సేవలో నిరంతరం నిమగ్నమయ్యే టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం దిశగా కీలక అడుగు పడిందని TTD వెల్లడించింది. పాదిరేడు అరణ్యం వద్ద 418 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న గృహ స్థలాల లేఅవుట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.230 కోట్లతో చేపట్టే పనులను ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారని TTD స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేస్తామని TTD తెలిపారు.