ప్రముఖ సింథ్ పాప్ సంగీతకారుడు పీటర్ బైర్న్ కన్నుమూత
రిపోర్టర్: రమేష్
స్థలం: లాస్ ఏంజెలెస్
ప్రముఖ సింథ్ పాప్ సంగీతకారుడు, నేకెడ్ ఐస్ బ్యాండ్ సహ వ్యవస్థాపకుడు పీటర్ బైర్న్ అనారోగ్యంతో లాస్ ఏంజెలెస్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఈ విషయాన్ని గ్రూప్ ప్రతినిధి జిమ్ మెర్లిస్ ధ్రువీకరించారు. రోబ్ ఫిషర్‌తో కలిసి 1982లో నేకెడ్ ఐస్ బ్యాండ్‌ను స్థాపించిన ఆయన, అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల సంగీత లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.