మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో 'త్రిశూల్' కమిటీ ఏర్పాటు
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాలు, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు 'త్రిశూల్' పేరిట ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు కావాలని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్న భయం కలిగించాలని స్పష్టం చేశారు. సీఐడీలో 24/7 సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి నేరస్థులకు శిక్షల రేటు పెంచాలని నిర్దేశించారు.