జేఎన్టీయూహెచ్ వివాదాస్పద నిర్ణయం: ఎప్‌సెట్ కార్యాలయం కేటాయింపుపై తీవ్ర దుమారం
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
అత్యంత గోప్యతతో కూడిన జేఎన్టీయూహెచ్ ఎప్‌సెట్ కార్యాలయాన్ని మహిళా ఉద్యోగుల వెల్నెస్ సెంటర్‌గా మారుస్తూ రిజిస్ట్రార్ డాక్టర్ జయలక్ష్మి సర్క్యులర్ జారీ చేశారని అధికారులు తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కీలక రికార్డులు, సర్వర్లు ఉన్న ఆఫీసును కేటాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోప్యతకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుండగా, ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వర్సిటీ అధికారులను ఆదేశించారు.