బీసీ రిజర్వేషన్ల పెంపుపై వైకాపా ద్వంద్వ వైఖరి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

బీసీలకు రిజర్వేషన్లు పెరిగితే వైకాపా నేతలకు ఎందుకు బాధ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. దిల్లీలో రాష్ట్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, ఉన్న వెసులుబాటును ఎందుకు వదులుకోవాలని ఆయన ప్రశ్నించారు. బీసీలపై గొడ్డలి పార్టీకి ఎందుకు అంత కక్ష అని ఆక్షేపించారు. గతంలో వైకాపా రిజర్వేషన్లను తగ్గించి పదవులు కోల్పోయేలా చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా దుయ్యబట్టారు.