వరంగల్ జిల్లాలో అధికారుల పర్యటనపై కలెక్టర్ సమీక్ష

రిపోర్టర్: కిరణ్ స్థలం: వరంగల్

వరంగల్ జిల్లా పర్వతగిరి మార్కెట్ యార్డులో కంది పప్పు మిల్లు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించినట్లు కలెక్టర్ వరంగల్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, మహిళా సంఘాల ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు తెచ్చేలా నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే కలెక్టరేట్లో జరిగిన ఆహార భద్రత సలహా కమిటీ సమావేశంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.