నెల్లూరులో దారుణం: ఆటో తీయమన్న చిన్న వివాదంలో డ్రైవర్ హత్య

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు గ్రామీణ మండలంలోని కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీలో ఆదివారం సాయంత్రం ఆటో డ్రైవర్ వరుణ్ కిరాతక హత్యకు గురయ్యారు. రోడ్డుపై ఆటో అడ్డుగా లేదని చెప్పినందుకు ఆగ్రహించిన ముగ్గురు యువకులు బైక్పై వెంబడించి అద్దంతో గుండెలపై పొడిచి చంపినట్లు నెల్లూరు గ్రామీణ డీఎస్పీ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకోగా, నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.