టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: టెక్కలి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిండు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వెలిబుచ్చారు. ఈ దుర్ఘటనలో బలైన విద్యార్థుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.