విజయనగరంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా సాలిపేట రోడ్ సేఫ్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎంవీఐ ఎం. రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఐటీఐ ఉద్యోగి దుక్కలక్కీ శేఖర్ చేస్తున్న సమాజ సేవలను గుర్తించి, అమ్మ సేవా సంఘం తరపున ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ ఎన్జీవో సభ్యులు పాల్గొని ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు.