డాక్టర్ చక్రపాణి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ డాక్టర్ ఏ. చక్రపాణి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించిన అనంతరం తొలి చైర్మన్గా చక్రపాణి గారు ఎంతో నిబద్ధతతో పనిచేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.