మంగంపేట ముగ్గురాయి ఎగుమతులపై నిజనిర్ధారణ కమిటీ తీవ్ర ఆరోపణలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

మంగంపేట ముగ్గురాయిని విదేశాలకు తరలించడం ద్వారా రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతోందని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఏపీఎండీసీకి రూ.1,300 కోట్ల ఆదాయం వస్తున్నా, గనిని మూసివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. టెండర్లలో పారదర్శకత లేదని, వెంటనే ఎగుమతులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని వారు కోరారు.