హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ వద్ద శాశ్వత వన్‌వే మరియు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నివారణకు చేపట్టిన వన్‌వే ప్రయోగం విజయవంతం కావడంతో అధికారులు దీనిని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో వాహనదారుల సౌకర్యార్థం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి షేక్‌పేట్ వరకు 9 కిలోమీటర్ల పొడవునా 6 లేన్ల భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు వేగవంతం చేశారు.