పెదకాకాని ఆలయంలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: రమేష్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం చోరీని రాజకీయం చేసేందుకు వైకాపా నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుడైన అర్చకుడిని వెనకేసుకొస్తూ, కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వైకాపా నేతలను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ఆలయంలోకి దూసుకెళ్లిన వైకాపా కార్యకర్తలు, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలని తెదేపా డిమాండ్ చేసింది.