మాజీ మంత్రి జోగి రమేష్ కోడలి సంచలన ఆరోపణలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన తనకు అదనపు కట్నం వేధింపులు, హత్యాయత్నాలతో ప్రాణహాని ఉందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్​కి విజయవాడ లోక్​ భవన్​లో ఫిర్యాదు చేశారు. భర్త రాజీవ్, అత్తమామలు తనను రూ. 5 కోట్లు, కారు కోసం శారీరకంగా, మానసికంగా వేధించారని, మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చి హత్యకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.