శాన్ ఆంటోనియోలో వైభవంగా దసరా, దీపావళి సంబరాలు: సంగీత దర్శకుడు కోటికి సత్కారం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: San Antonio, Texas

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియో నగరంలో శాన్ ఆంటోనియో తెలుగు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ మొదటి తేదీన దసరా, దీపావళి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టాసా ప్రతినిధులు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు కోటి యాభై ఏళ్ల అపూర్వ సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆయనను ఘనంగా సత్కరించనున్నారు. ఈ మేరకు సంగీత ప్రియులను అలరించేలా ప్రత్యేక లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.