రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనపై ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి

రిపోర్టర్: సతీష్ స్థలం: Telangana

రిమ్స్ ఆసుపత్రిలో అభం శుభం తెలియని పసికందులు అగ్నికి ఆహుతి కావడం అత్యంత విషాదకరమని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎంజీఎం ఆసుపత్రి ఘటనపై కూడా ఆయన స్పందించారు.