నీరు లేక పుట్లూరు చెరువులోనే గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని చెరువు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తిగా ఒట్టిపోయింది. వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు స్థానికులు ఈ చెరువుకు తీసుకువచ్చారు. అయితే నీరు లేకపోవడంతో నిమజ్జనం చేయడానికి వీలుకాక గణనాథులను అక్కడే వదిలి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.