యూపీఐ ద్వారా క్రెడిట్ సేవలతో చిన్న బ్యాంకుల సరికొత్త వ్యూహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

భారతీయ బ్యాంకింగ్ రంగంలో చిన్న బ్యాంకులు మరియు ఫిన్టెక్ సంస్థలు సరికొత్త వ్యూహానికి తెరలేపాయని ఆర్థిక విశ్లేషకులు సూర్య ప్రకాష్ జోశ్యుల పేర్కొన్నారు. పెద్ద బ్యాంకులతో నేరుగా పోటీపడలేక, ట్రోజన్ హార్స్ తరహాలో యూపీఐ వేదికగా క్రెడిట్ లైన్ సేవలను అందిస్తూ మార్కెట్లోకి చొచ్చుకెళ్తున్నాయని తెలిపారు. జేబులో డబ్బులు లేకపోయినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అప్పు తీసుకునేలా ఈ విధానం మారుతోందని, తద్వారా చెల్లింపుల రంగానికి సరికొత్త రూపు వస్తోందని విశ్లేషకులు స్పష్టం చేశారు.