ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న ఉషు అథ్లెట్ దివ్యాన్షి చౌదరి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

ఆసియా క్రీడల ఉషు జట్టు నుంచి తనను తొలగించడంపై మొదట ప్రశ్నించిన అథ్లెట్ దివ్యాన్షి చౌదరి ఇప్పుడు ఫెడరేషన్ నిర్ణయాన్ని సమర్థించారు. మోకాలి గాయం కారణంగా ముందుగా కోలుకోవడంపైనే దృష్టి పెట్టాలని అధికారులు తనకు వివరించినట్లు ఆమె తెలిపారు. ఆరోగ్యమే ప్రాధాన్యమని గ్రహించానని, త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతానని వెల్లడించారు.