తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో కలకలం రేపిన చిరుతపులి సంచారం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుమల
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఏడవ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం మధ్యలో ఓ చెట్టుపై చిరుత సంచరిస్తుండటాన్ని గుర్తించిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది, అటవీశాఖ అధికారులు అప్రమత్తమై భక్తులను గుంపులు గుంపులుగా నడవాలని సూచించారు.