తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించిన నటుడు రాఘవ్ జుయాల్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భారతదేశం

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న ప్రముఖ నటుడు, డాన్సర్ రాఘవ్ జుయాల్ టాలీవుడ్ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు, కళాకారుడికి ఇచ్చే గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఇక్కడ సినిమాను కేవలం పనిలా కాకుండా ఒక పండుగలా జరుపుకుంటారని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.