నకిలీ ఐఏఎస్ అధికారిగా చలామణి అయిన మహిళ అరెస్ట్
రిపోర్టర్: సురేష్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో నకిలీ ఐఏఎస్ అధికారిగా అవతారమెత్తి మోసాలకు పాల్పడుతున్న త్రిప్తి సింగ్ రాజ్‌పూత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టూరిజం శాఖలో అదనపు డైరెక్టర్‌నంటూ నమ్మించి నిరుద్యోగులను మోసం చేసింది. విధి నిర్వహణలో నకిలీ గుర్తింపు కార్డులు, ప్రభుత్వ వాహనం వాడుతూ పోలీసులకు చిక్కింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.