వృద్ధుడికి అరుదైన రోబోటిక్ శస్త్రచికిత్స విజయవంతం

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

అపోలో ఆసుపత్రిలో 76 ఏళ్ల వృద్ధుడికి వైద్యులు అరుదైన రోబోటిక్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. డయాఫ్రమ్ సమస్యతో బాధపడుతున్న అతనికి గుండె జబ్బులు ఉన్నప్పటికీ, డాక్టర్ అలోయ్ ముఖర్జీ నేతృత్వంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి అవసరమైన మరమ్మతులు చేశారు. కేవలం మూడు రోజుల్లోనే కోలుకుని వృద్ధుడు డిశ్చార్జ్ అయ్యారు.