రాహుల్ గాంధీ కపట నాటకాలు బయటపడ్డాయంటూ కేటీఆర్ ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి మాట్లాడటం, మొహబ్బత్ కీ దుకాణ్ అనడం కేవలం కపట నాటకమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు విరుద్ధంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.