తెలంగాణ చిహ్నాలను గుర్తించాలంటూ కాంగ్రెస్ నేతకు ఉపాధ్యాయుడి వినతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అక్కన్నపేట

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు యామ రాజు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ చిహ్నాలను రూపకల్పన చేసిన దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళే క్రమంలో ఆదివారం ఉపాధ్యాయ సంఘాల తో పాటుగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కి చిహ్నాల బుక్కును అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.