మైసా సినిమా అప్డేట్: తొలి గీతం విడుదల చేసిన చిత్ర యూనిట్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ వెల్లడించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు చిత్రంలోని ‘ఓ మైసా రే’ అంటూ సాగే పవర్ఫుల్ తొలి గీతాన్ని విడుదల చేసినట్లు దర్శకుడు రవీంద్ర పుల్లె తెలిపారు.