తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం: రేవంత్ కీలక నిర్ణయం
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఉన్న మూడు ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, పనితీరు సరిగ్గా లేని మంత్రులకు ఉద్వాసన పలికేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీ మహిళా ప్రాతినిధ్యానికి, జిల్లాల వారీగా సమతుల్యతకు ప్రాధాన్యతనిస్తూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డైనమిక్ నాయకులకు కేబినెట్‌లో చోటు కల్పించేలా రేవంత్ వ్యూహరచన చేస్తున్నారు.