యువ ఇంజనీర్ సంచలనం: అమెజాన్లో యాభై లక్షల వార్షిక వేతనం సాధించిన వైనం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

పుట్టుకతోనే ఎడమ చేయి లేకపోయినా పట్టుదలతో రాణించిన సాయి భారత్ అసాధారణ ప్రతిభ కనబరిచారని ఎన్ఐటీ వరంగల్ అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఆయన, ప్రముఖ సంస్థ అమెజాన్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా ఎదిగి ఏటా యాభై లక్షలకు పైగా వేతనం అందుకుంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని సహచరులు కొనియాడారు.