మురసు తుపాను బీభత్సం: ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలలో స్తంభించిన రాకపోకలు

రిపోర్టర్: విజయ్ స్థలం: NTR District

మురసు తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాలలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. నందిగామ మండలం దాములూరు వద్ద వైరా నది, గంపలగూడెం మండలం వద్ద కట్టలేరు పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే నల్లమడ వాగు ఉద్ధృతికి పెదనందిపాడు మండలం లోని పలు గ్రామాలు నీటమునిగాయి. వరి పంట నేలవాలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.