ఫేక్ అకౌంట్ పోస్టును అసెంబ్లీలో ప్రదర్శించడం సిగ్గుచేటు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
సోషల్ మీడియాలో సంధ్యా రావు పేరుతో ఉన్న ఫేక్ ఎక్స్ ఖాతా పోస్టును అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. పార్టీలో అంతర్జాతీయ కార్యదర్శి పదవే లేదన్న ఆయన, ఫేక్ పోస్టులు సృష్టించి సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా సిట్ విచారణకు ఆదేశించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.