స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: వంద పురపాలక సంఘాలకు నోటిఫికేషన్

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజు వంద పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మిగిలిన ఇరవై మూడు స్థానాలకు మరో రోజు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం ఇరవై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు.