ఇస్రో భవిష్యత్తుపై ప్రైవేట్ రంగ ప్రవేశంతో తీవ్ర ఆందోళన
రిపోర్టర్: సునీల్
స్థలం: India
ఇస్రోలో రాకెట్ల తయారీ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేస్తుండటంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇస్రో స్వయంగా రాకెట్లు తయారు చేయదంటూ IN-SPACe ఛైర్మన్ పవన్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు శాస్త్రవేత్తలు, ఉద్యోగుల్లో కలకలం రేపాయి. సాంకేతిక పరిజ్ఞానం ప్రైవేటీకరణ వల్ల సంస్థ మనుగడ, ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం అవుతాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.