మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లా మద్దూరులో జరుగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వచ్చే మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురుకుల కోసం స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు.