మంచిరేవుల గ్రేహౌండ్స్ భూముల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: హరీశ్ రావు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
మంచిరేవులలో గ్రేహౌండ్స్ భూముల అన్యాక్రాంతంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాపాడిన కోట్లాది రూపాయల విలువైన పోలీసు శాఖ భూమిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎలాంటి పరిశీలన లేకుండా జీరో కన్సిడరేషన్ తో రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.