ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
చంచల్‌గూడ జైలుకు చెందిన రిమాండ్ ఖైదీ శివశంకర్ రెడ్డి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పారిపోయాడు. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఈ ఘటన చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి పరారీతో జైలు అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖైదీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.