నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామం: వైకాపాను వీడి జనసేనలోకి ముప్పై ఐదు మంది
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కావలి రూరల్ ప్రాంతంలో వైకాపాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముప్పై ఐదు మందికి పైగా కార్యకర్తలు అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు సోమయ్య గారి పరుశురాం ఆధ్వర్యంలో ఈ రాజకీయ మార్పు చోటుచేసుకుంది. స్థానిక నేతల చొరవతో వైకాపాను వీడిన కార్యకర్తలు జనసేన గూటికి చేరడంతో ఆ ప్రాంతంలో రాజకీయ చర్చనీయాంశమైంది.