కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ కొడాలి నాని ఆగ్రహం

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

బీజేపీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన కూటమి సర్కార్ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల వ్యాపారాలు, ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.