కాశీబుగ్గ ఎఫ్ఆర్ఓగా మురళీకృష్ణ బాధ్యతలు: వన్యప్రాణుల రక్షణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మురళీకృష్ణ, అటవీ సంపద మరియు వన్యప్రాణుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని పన్నెండు వేల హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమణల బారిన పడకుండా కాపాడటంతో పాటు, వజ్రపుకొత్తూరు తీర ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారంతో తలెత్తే మానవ-జంతు సంఘర్షణను అరికట్టేందుకు ముమ్మర చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే రేంజ్ పరిధిలోని మూడు చిత్తడి నేలల సరిహద్దులను పకడ్బందీగా నిర్ధారిస్తామని ఆయన తెలిపారు.