ప్రపంచ ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
ప్రపంచంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు సామాన్య ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిక్స్ సదస్సులో మాట్లాడిన ఆయన మహమ్మారులు, వాతావరణ విపత్తులు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావని నిరూపించాయన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.