విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసిన మెగా డీఎస్సీ శాప్ కార్యాలయం ముట్టడి

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ విజయవాడ శాప్ కార్యాలయం ముట్టడికి యత్నించిన వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌తో పాటు పలువురిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మరోవైపు వైసీపీ ఆరోపణలను ఖండిస్తూ డీఎస్సీ ఉద్యోగులు ప్రతినిరసనకు దిగడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.