బెంగళూరులో దారుణం భార్యను గొంతు నులిమి హత్య చేసి కాచి నూనె పోసిన భర్త

రిపోర్టర్: శివ స్థలం: బెంగళూరు

కర్ణాటక రాజధాని బెంగళూరులోని బిలెకాళ్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో రంజిత్ కుమార్ గుప్తా అనే వ్యక్తి తన భార్య గుంజ మదేశియాను గొంతు నులిమి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహంపై కాచి నూనె పోసి చర్మాన్ని పీకేసేందుకు దారుణంగా ప్రయత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మిలొ లేఅవుట్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.