తుపాను నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ బొత్స సత్యనారాయణ డిమాండ్
రిపోర్టర్: రాము
స్థలం: చీపురుపల్లి
కూటమి ప్రభుత్వానికి రైతులు మరియు వ్యవసాయం పట్ల కనీసం శ్రద్ధ లేదని, తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని పీకే పాలవలస ప్రాంతంలో నష్టపోయిన అరటి మరియు బొప్పాయి పంటలను వైకాపా జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అన్నదాతలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.