జీవిత సత్యాలు వెల్లడించిన నటి అనుపమ పరమేశ్వరన్ మనసులోని మాట

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

నో చెప్పడం చేతకాని వారు జీవితంలో ఎదగలేరని నటి అనుపమ పరమేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుటుంబ బాధ్యతల వల్ల తనకోసం బతకడం మర్చిపోయానని తెలిపారు. మానసిక ఆరోగ్యం పాడైన తర్వాతే తనకు అసలు నిజం తెలిసొచ్చిందని వెల్లడించారు. ఇతరులకు నిర్మొహమాటంగా నో చెప్పడం నేర్చుకున్నానని, ఈ మార్పు వల్ల తనకు మానసిక ప్రశాంతత లభించిందని ఆమె సంతోషంగా చెప్పుకొచ్చారు.