పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనుల వినతి

రిపోర్టర్: Thrinadh Rudi స్థలం: పెదబయలు

అల్లూరి జిల్లా పెదబయలు మండలం గోమంగి పంచాయతీ కారుగొండలో ఎంపీపీ పాఠశాల భవనం పైకప్పు పెచ్చులుడిడి, వర్షపు నీరు తరగతి గదిలోకి రావడంతో సుమారు 82 మంది విద్యార్థులు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.