ఫిక్స్డ్ డిపాజిట్ల నిబంధనల్లో మార్పులు చేసిన ఆర్బీఐ

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

ఫిక్స్డ్ డిపాజిట్ల నిబంధనలలో కీలక మార్పులను ఆర్బీఐ అమల్లోకి తెచ్చిందని అధికారులు వెల్లడించారు. రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో వేసే టర్మ్ డిపాజిట్లను ఇకపై బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. వడ్డీ రేట్ల వెల్లడిలో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అయితే ఈ మార్పుల వల్ల సాధారణ ఎఫ్డీ పెట్టుబడిదారులపై ఎటువంటి ప్రత్యక్ష ప్రభావం ఉండదని, చిన్న మొత్తాల డిపాజిట్లపై పాత వడ్డీ రేట్ల నిబంధనలే యథాతథంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.