దేశంలో నీట్ యూజీ ఆన్లైన్ పరీక్ష నిర్వహణపై కసరత్తు

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షను ఆన్లైన్ విధానంలోకి మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పబ్లిక్ పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా జాతీయ స్థాయి కంప్యూటర్ ఆధారిత పరీక్షా మౌలిక సదుపాయాల వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలోని ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఇబ్బందులను కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.