'స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలి': జి. కిషన్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
తెలంగాణ విమోచనోద్యమం మరియు స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన కొమరం భీమ్, స్వామి రామానంద తీర్థ, చాకలి ఐలమ్మ, పీవీ నరసింహారావుతో పాటు ఎంతోమంది త్యాగధనులను మనం ఎప్పుడూ స్మరించుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలు అమూల్యమైనవని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారి చరిత్రను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.