ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యంపై అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సప్ మెసేజ్‌లపై ఉన్న శ్రద్ధ ఫైళ్ల క్లియరెన్స్‌పై ఎందుకు ఉండదని నిలదీశారు. ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారా అని అసహనం వెలిబుచ్చారు. నిర్ణయాల్లో జాప్యాన్ని సహించబోమని, ఫైళ్లు పెండింగ్‌లో పెట్టే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, 360 డిగ్రీల ఒపీనియన్లు తీసుకుంటామని హెచ్చరించారు.