పరీక్షల సంస్కరణలపై సీఎం చంద్రబాబుతో నందన్ నిలేకని కీలక భేటీ
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ నందన్ నిలేకని భేటీ అయ్యారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పరీక్షల విధానాన్ని సమూలంగా మార్చడంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఏపీలో అనుసరిస్తున్న అకడమిక్, కాంపిటేటివ్ పరీక్షల విధానాలను నిలేకని అడిగి తెలుసుకున్నారు. పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడంపై చర్చించారు.