అగ్నివీరులకు భారీ ఊరట: సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీరుల సేవా కాలం రెండేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి వెల్లడించారు. నాలుగు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకునే తొలి బ్యాచ్ అగ్నివీరులకు అదనంగా మరో రెండు సంవత్సరాల సర్వీస్ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత అర్హత ఆధారంగా రెగ్యులర్ సాయుధ దళాల్ లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.